ETV Bharat / state

పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సూపర్​ స్కెచ్ - నేటి నుంచి రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు శ్రీకారం - BJP focus on Telangana Parliament elections

BJP Vikasit Bharat Sankalp Yatra Starts Today : వచ్చే ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కాషాయదళం పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా కమలం పార్టీ యాక్షన్ ​ప్లాన్​ను సిద్ధం చేసుకుంటోంది. ప్రజలకు చేరువయ్యేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ పేరిట యాత్రలకు పూనుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నేటి నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. జనవరి 26వ తేదీ వరకు ఈ యాత్రను కొనసాగించనున్నారు.

BJP Focus on Parliament Elections in Telangana
BJP Vikasit Bharat Sankalp Yatra Starts Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 7:26 AM IST

పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్- నేటి నుంచి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు శ్రీకారం

BJP Vikasit Bharat Sankalp Yatra Starts Today : లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) పార్టీ రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కామారెడ్డి నుంచి ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏరికోరి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడంపై ప్రత్యేక కారణం కూడా ఉంది. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డిని(CM Revanth reddy) ఓడించి డబుల్ జైంట్ కిల్లర్​గా కాటిపల్లి వెంకట రమణారెడ్డి గుర్తింపు పొందారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక మాజీ, ఒక తాజా ముఖ్యమంత్రిని ఢీకొట్టి గెలుపొందడంతో కమలం పార్టీ ఇక్కడి నుంచే యాత్రను షురూ చేయాలని భావిస్తోంది.

లోక్​సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి

BJP Focus on Parliament Elections in Telangana : దాదాపు 40 రోజుల పాటు ఈ యాత్ర జరగనుండగా, 163 వాహనాలు నిత్యం తిరిగేలా ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహనాలు తిరగనున్నాయి. ప్రతి రోజు ఈ యాత్ర కొనసాగనుంది. రోజుకు రెండు సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో మొత్తం 13 వేల సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర పథకాలకు కొత్త లబ్ధిదారులను ఎన్​రోల్ చేసుకోవడం ఈ యాత్ర ఉద్దేశంగా ఉంది.

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేశారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఉన్న కేంద్ర మంత్రులు ఈ యాత్రలో 3 రోజులైనా పాల్గొనాలని పార్టీ నేతలకు సైతం ఆదేశించినట్లు తెలుస్తోంది. జన్ జాతీయ గౌరవ్ దివస్​ను పురస్కరించుకుని గత నెల 15న ఝార్ఖండ్​లోని రాంచీ నుంచి ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప్​ యాత్రను ప్రారంభించారు. అయితే తెలంగాణతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలో ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.

ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమే - బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక

ఎన్నికలు ముగియడంతో త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ యాత్రకు గ్రీన్​సిగ్నల్ చెప్పింది. ఈ యాత్రను సమన్వయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించింది. అలాగే సంస్థాగత స్థాయిలో సమన్వయం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒక సీనియర్ కార్యకర్తను నియమించింది. యాత్రలో ప్రజలు భాగస్వాములవుతున్నారా? లేదా? అనే వివరాలను ఎప్పటికప్పుడు నివేదిక పంపించేందుకు 10 నుంచి 15 మంది కార్యకర్తలు యాత్ర వెంట ఉండేలా ఏర్పాట్లు చేసింది.

యాత్రలో వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ఎన్​రోల్​మెంట్ చేసేలా చూడాలని పార్టీ నేతలకు సైతం ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. యాత్ర మార్గం, జన సమీకరణ, ప్రభుత్వ పథకాల ఫారంను నింపడం, మై భారత్ పోర్ట్​లో యువతను నమోదు చేయించడం లక్ష్యంగా పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవయ్యేలా చేసి అధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని చూస్తున్న కాషాయ పార్టీ స్కెచ్ వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

"వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. నేటి నుంచి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాలను గడప గడపకూ వివరించాలి. తెలంగాణలో బీజేపీకి మంచి రాజకీయ భవిష్యత్త్ ఉంది". - కిషన్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

పార్లమెంట్‌ ఎన్నికలపై కమలం పార్టీ గురి - టికెట్ల కోసం నాయకుల మధ్య హోరాహోరీ పోటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.