ETV Bharat / state

BJP Telangana Election Committee 2023 : ఎన్నికల కోసం.. 26 మందితో బీజేపీ ప్రత్యేక కమిటీ - ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేక కమిటీ

BJP Telangana Election Committee 2023 : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఎన్నికల కార్యాచరణ పేరుతో 26 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఐదుగురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు ఉన్నారు. వీరిలో తెలుగు వారికీ కూడా అవకాశం కల్పించారు.

BJP special committee
BJP Forms 26 Member Election Management Committee
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 10:10 AM IST

Updated : Sep 29, 2023, 10:44 AM IST

BJP Telangana Election Committee 2023 : ఎన్నికల కార్యాచరణలో భాగంగా భారతీయ జనతా పార్టీ 26 మందితో ప్రత్యేక కమిటీ(BJP Special Committee)ని నియమించింది. ఐదుగురు కేంద్ర మంత్రులు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యనేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ముఖ్యనేతలను తెలంగాణ ఎన్నికల్లో(Telangana Assembly Election) భాగస్వామ్యం చేసి కీలక బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.

BJP Election Committee 2023 : ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గసభ్యుడు సోమువీర్రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్​ రెడ్డికి ఈ కమిటీలో స్థానం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను సమన్వయం చేసుకోవడం, అభ్యర్థులు ఎంపికలో తోడ్పాటు అందించడం, జాతీయ నేతల బహిరంగ సభలు నిర్వహణలో సమన్వయం చేయడం, ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన కార్యక్రమాల్లో తోడ్పాటు అందించడంతోపాటు హైదరాబాద్, తెలంగాణలోని ఆయా జిల్లాల ఓటర్లు లక్ష్యంగా పని చేస్తుంది. కమిటీలోని 26 మంది నేతలు తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకూ పూర్తి సమయాన్ని కేటాయించి ఎన్నికల్లో అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించనున్నట్లు సమాచారం.

Telangana BJP Leaders Secret Meeting : 'ఎరక్కపోయే వచ్చి బీజేపీలో ఇరుక్కుపోయామే.. ఇప్పుడేం చేసేది.. ఎటువెళ్లేది..?'

BJP Special Committee For Election 2023 : ఈ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి పని చేయనున్నారు. అక్టోబర్ ఐదో తేదీన దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈ 26 మంది కమిటీతో ప్రత్యేకంగా సమావేశమై కార్యాచరణను వివరిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ ఆరో తేదీన హైదరాబాద్‌లో జరిగే బీజేపీ విస్తృతస్థాయి కౌన్సెల్ సమావేశంలో కూడా వీరిని భాగస్వామ్యం చేయనున్నారు.

PM Modi Telangana Tour on October 1st : అక్టోబర్ ఒకటి, మూడో తేదీల్లో మహబూబ్​నగర్, నిజామాబాద్‌లలో ప్రధాని నరేంద్రమోదీ బహిరంగసభలు.. ఉన్నందున అందుబాటులో ఉన్న నేతలు హైదరాబాద్ చేరుకుని అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలని సూచించినట్లు తెలిసింది. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్​చుగ్‌ ఈ 26 మంది కమిటీ సభ్యులకు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కమలం జెండాను ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

PM Modi Telangana Tour Schedule : అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. మహబూబ్​నగర్ వేదికగా ఎన్నికల శంఖారావం

Internal Disputes in Telangana BJP : ఈటల తీరుపై కీలక నేతల గుర్రు.. త్వరలోనే జాతీయ నాయకత్వం దృష్టికి..!

Last Updated : Sep 29, 2023, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.