ETV Bharat / state

BJP Strategy Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. బీజేపీ వర్క్ షాప్స్.. బస్సు యాత్రలు - హైదరాబాద్ వార్తలు

BJP Strategy for Telangana Assembly Elections 2023 : తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ సంస్థాగత బలోపేతం, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలను తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోహరించేలా ప్రణాళిక రచిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కార్యశాలను నిర్వహిస్తోంది. ఆదివారం నుంచి వారం పాటు ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెలాఖరు నుంచి బీజేపీ నేతల బస్సు యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

BJP MLAs Tour In Telangana
Telangana Assembly Elections 2023
author img

By

Published : Aug 18, 2023, 12:06 PM IST

BJP Strategy Telangana Assembly Elections 2023 తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. బీజేపీ వర్క్ షాప్స్.. బస్సు యాత్రలు

BJP Strategy for Telangana Assembly Elections 2023 : తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగరవేయడమే లక్ష్యంగా కమలదండు ప్రణాళికలు రచిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన అగ్రనాయకత్వం.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలను తెలంగాణకు పంపిస్తోంది.

BJP MLAs Workshop in Hyderabad 2023 : ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలకు శనివారం రోజున హైదరాబాద్‌లో కార్యశాలను నిర్వహిస్తోంది. మూడు నుంచి నాలుగు గంటల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేసీఆర్‌ పాలనలో లోపాలు, విస్మరించిన హామీలపై అవగాహన కల్పించనున్నారు. ఆదివారం నుంచి తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు వెళ్లి.. వారం పాటు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'

BJP Bus Yatra in Telangana 2023 : పోలింగ్‌ బూత్‌, శక్తి కేంద్రాల అధ్యక్షులతో సమావేశమై పార్టీ బలోపేతం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023).. పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజలను ప్రభావితం చేసే మేధావులు, విద్యావేత్తలతోనూ సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ దృష్టికి వచ్చిన అంశాలపైన నివేదికను సిద్ధంచేసి జాతీయ నాయకత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే పార్టీ గెలుపు గుర్రాలపైనా దృష్టి పెట్టనున్నారు.

Telangana Leaders party Jumping : టికెట్​ కోసం గోడ దూకేందుకు సై.. తెలంగాణలో జంపింగ్‌ జిలానీల సీజన్‌ స్టార్ట్​

బీజేపీ పాలిత రాష్ట్రాల ఎమ్మెల్యేలు (Other State BJP MLAs Telangana Visit) తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యేల వసతి, భోజన సదుపాయం వంటి అంశాలపై జిల్లా నాయకత్వాలను అప్రమత్తం చేసింది. ఎమ్మెల్యేలకు స్వాగతం, వసతి సదుపాయాలను దగ్గరుండి చూసుకోవాలని.. యువ మోర్ఛా జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేసింది.

మరోవైపు ఈ నెలాఖరులోనే బీజేపీ నేతలు బస్సుయాత్రలు చేసే అవకాశం ఉంది. భద్రాచలం, బాసర, అలంపూర్‌ నుంచి.. ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో మార్గంలో 36 నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు కాషాయ దళం సిద్ధమవుతోంది. ఈ యాత్రను సెప్టెంబర్ 17న ప్రారంభించి.. అక్టోబర్ రెండున ముగించేందుకు ప్లాన్ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(BJP state president Kishan Reddy), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వాహణ కమిటీ ఛైర్మన్​ ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

BJP Bus Yatra Plan in Telangana : ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో .. బీజేపీ బస్సు యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.