ETV Bharat / state

గులాబీ తోటలో సంజయ్​కే సారథ్యం ఎందుకు.. - BJP Telangana State President Bandi Sanjay

రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా దృష్టిసారించిన భాజపా జాతీయ నాయకత్వం యువ నేతను అధ్యక్షుడిగా ప్రకటించింది. హిందుత్వ వాదం, దూసుకుపోయే తత్వమున్న బండి సంజయ్​ కుమార్​కు పార్టీ పగ్గాలు కట్టబెట్టింది. ఆ అధ్యక్ష హోదాలో తొలి ప్రసంగంలోనే కేసీఆర్​ సర్కార్​పై నిప్పులు చెరిగిన సంజయ్‌.. ఇక ముందూ అదే విధంగా వ్యవహరిస్తారా.. గులాబీ తోటలో కమల వికాసానికి తోడ్పడతారా అనేది మున్ముందు తెలుస్తుంది.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Mar 21, 2020, 4:09 PM IST

తెలంగాణలో అధికారంలోకి రావాలని పథకాలు రచిస్తోన్న భాజపా.. తమ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రానికి సారధిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. హేమాహేమీలను కాదని సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.

విద్యార్థి దశ నుంచే

కరీంనగర్ ఎంపీగా ఉన్న సంజయ్.. విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. విద్యార్థి సంఘం ఏబీవీపీ, యువమోర్చా లాంటి సంఘాల్లో చురుకుగా వ్యవహరించారు. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్​... తెరాస ముఖ్యనేత, సిట్టింగ్‌ ఎంపీ అయిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఓడించి అందరి దృష్టి ఆకర్షించారు.

యువరక్తం వైపే..

పార్టీ రాష్ట్ర సారధి కోసం కమల దళం తీవ్ర కసరత్తు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, అప్పటి అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డిలను కాదని సంజయ్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం రావాలన్నా.. తెరాసను సమర్థంగా ఎదుర్కోవాలన్నా.. యువరక్తాన్ని తీసుకురావాలని జాతీయ నాయకత్వం భావించింది. పార్టీ అధ్యక్ష పదవిని హైదరాబాద్‌ నేతలకే కట్టబెడతారన్న అపవాదు పోవాలంటే గ్రామీణ ప్రాంత నేతకే పగ్గాలు అప్పగించాలని దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆర్​ఎస్​ఎస్​ మద్దతుతో పాటు అమిత్​షా, నడ్డాలు సంజయ్​కే జై కొట్టారు.

సీనియర్లు సహకరిస్తారా..

సీనియర్లను పక్కన పెట్టి సంజయ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించినప్పటికీ వారందరూ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తారా లేదా అనేది హాట్​ టాపిక్​గా మారింది. అధ్యక్షుడిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా దిల్లీ నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన సంజయ్​కు స్వాగతం పలికే క్రమంలో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. అభినందన సభలో సంజయ్​ ప్రసంగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అధికారం సులువేం కాదు..

2023లో రాష్ట్రంపై కాషాయజెండా ఎగరవేయడం ఖాయమని సంజయ్​ ప్రకటించినా.. అది అంత సులభమేం కాదు. పార్టీ కేవలం పట్టణాలకే పరిమితం కావడం, క్షేత్ర స్థాయిలో బలహీనంగా ఉండటం కొంత మైనస్​గా మారింది. సీనియర్లు, పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకొని ముందుకు పోవడం సంజయ్​ ముందున్న పెద్ద సవాల్​. ఉగాది సందర్భంగా బాధ్యతలను స్వీకరిస్తారని.. పార్లమెంట్ సమావేశాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని సంజయ్ చెబుతున్నారు.

నూతన అధ్యక్షుడిగా సంజయ్‌ను ప్రకటించడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని.. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు నేతలు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. జాతీయ నాయకత్వం సంజయ్‌ రూపంలో విసిరిన అస్త్రం గులాబీ తోటలో కమల వికాసానికి దోహదం చేస్తోందో లేదో వేచి చూడాలి.

ఇదీ చూడండి : నగరంలో 67 మంది విదేశీయులు... ఎక్కడెక్కడ తిరిగారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.