ప్రాజెక్టుల పేరిట కమీషన్లు దండుకునేందుకు కేంద్రం నిధులు ఇవ్వదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, ప్రయోజనాల నిమిత్తమే బడ్జెట్లో నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి నిర్దిష్టమైన ప్రణాళిక లేదని, మద్యంపై ఆదాయం తప్పితే మిగతా వాటిపై ఎలాంటి ఆదాయం లేదని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారని ప్రశ్నించారు.
తెలంగాణ గజినిగా మంత్రి కేటీఆర్ మారిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఎంత సాయం చేస్తున్నా గుర్తుండట్లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ సమర్పించకుండా, జాతీయ హోదా ఎలా అడుగుతారని నిలదీశారు. బైంసా ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేశామని త్వరలోనే నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని లక్ష్మణ్ అన్నారు. పేద మధ్య తరగతి ప్రజలు బడ్జెట్‌ను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.
- ఇవీ చూడండి: అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!