శాసనసభలో లేని వ్యక్తిపై విమర్శలు చేయకూడదని సీనియర్‌గా చెప్పుకుంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు తెలియదా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. దుబ్బాకలో అబద్ధాలు చెప్పినందుకే హరీశ్ రావుకు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల పేరుతో తెరాస ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజక్టులను అడ్డుకోవాలని మాత్రమే తాను కేంద్రానికి లేఖ రాశానని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిన అంశాన్ని వదలనని చెప్పారు. లోక్‌సభ స్పీకర్ కొవిడ్ నుంచి కోలుకున్న వెంటనే కేసీఆర్‌పై ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిన విషయం బయటకు వచ్చాక సంచలనం అవుతుందన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్, భాజపాల పాత్ర : కేసీఆర్