భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 149మందితో ఆయన సమావేశమయ్యారు.
గెలిచిన కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమంతోపాటు... ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలో తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఓటమి చెందిన అభ్యర్థులు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్నారు. రాబోయే రోజులు భాజపావేనని కష్టపడి పని చేస్తే తగిన గుర్తింపు ఉంటుందని మార్గ నిర్దేశం చేశారు.