ETV Bharat / state

Bandi Sanjay On CM KCR: 'తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చినవ్' - Cm kcr news

Bandi Sanjay On CM KCR: దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్యహత్యల రాష్ట్రంగా మార్చి... దేశాన్ని కూడా అదే రీతిలో తయారు చేయడానికి సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Feb 21, 2022, 7:11 PM IST

Bandi Sanjay On CM KCR: సీఎం కేసీఆర్ ఎక్కడికెళ్లినా అబద్ధాలు చెప్పడం అలవాటైపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించి అక్కడ నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన మాటలపై బండి సంజయ్ స్పందించారు. ఏయే పంచాయతీలకు నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ దేశాన్ని ఏం చేయాలని నిర్ణయించుకున్నారని బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఏం చేయని ముఖ్యమంత్రి దేశాన్ని ఏం చేస్తారని నిలదీశారు. తెలంగాణ శివాజీ మహరాజ్ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి... శివాజీ వారుసలమని చెప్పుకునే శివసేనతో ఎలా సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అడిగారు. రాష్ట్రంలో కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారన్నారు. కుటుంబ అవినీతిలో కల్వకుంట్ల కుటుంబమే నంబర్‌వన్‌ అని ఆయన ఆరోపించారు. సీఎంలోని దేశ వ్యతిరేక భావజాలాన్ని యువత గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

బంగారు భారత్ అంట. ఇక్కడ బంగారు తెలంగాణ చేసిండు. ఇగ అక్కడ పోతడంట. ఏం చేసిండు బంగారు తెలంగాణల... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఉద్యోగులు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. బంగారు తెలంగాణ కాదు. ఆత్మహత్యల తెలంగాణ తయారు చేసినవ్. ఇప్పుడు బంగారు భారత్ చేస్తా అంటున్నడు. దేశాన్ని ఏలాలని కలలు కంటున్నడు. అవి కలలుగానే మిగిలిపోతాయి. నువ్వు నీ కుటుంబం చేసిందేమి లేదు. అడ్డగోలుగా దోచుకున్నరు.

-- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చినవ్'

ఇదీ చూడండి: CM KCR National Politics: 'దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.