పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని భాజపా ఆరోపించింది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు భాజపా ప్రతినిధి బృదం ఫిర్యాదు చేసింది.
గూగుల్ పే, ఫోన్‌పేతో డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. నగదుతోపాటు మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీని కలిసిన వారిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: కళాకారుల గొంతు ఇన్నేళ్లు మూగబోయింది: బండి సంజయ్