హైదరాబాద్ హెచ్ఐసీసీలో భాజపా సంస్థాగత వ్యవహారాల కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ కార్యదర్శి సంతోశ్ సహా.. అన్ని రాష్ట్రాల కార్యదర్శులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన తీరు, తదుపరి కార్యచరణపై సమావేశంలో చర్చించారు.
కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలు, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులపై నేతలు చర్చలు జరిపారు . తీర్మానాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కార్యదర్శులకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.