సికింద్రాబాద్ అల్వాల్‌లోని శివనగర్‌లో ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు చేపట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అని తెలిపారు. అల్వాల్, వెంకటాపూర్, మచ్చబొల్లారం డివిజన్లలో 5000 సభ్యత్వాలు నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పక్క ఉన్న భూములు, ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్నాయని వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు కోరారు.
ఇదీ చూడండి :మాజీ మేయర్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశం