BJP OBC Morcha National President K.Laxman: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశప్రగతికి పునాదులు వేసేలా ఉందని భాజపా ఓబీసీ మెర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ప్రజలపై ఒక్క రూపాయి అదనపు భారం పడకుండా కేంద్ర బడ్జెట్ రూపొందించారని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటిస్తారన్న విపక్షాల విమర్శలను కేంద్రం తిప్పికొట్టిందని వివరించారు.
''వ్యవసాయం వైపు యువత మొగ్గు చూపేలా బడ్జెట్ ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ కోర్సుల్లో కేంద్రం మార్పులు తెచ్చింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక, మౌలిక సౌకర్యాలు కల్పించింది. వ్యవసాయంలో కేంద్రం ఆధునిక సాంకేతికత తీసుకువచ్చింది. నదుల అనుసంధానానికి కేంద్రం చర్యలు చేపట్టింది. గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరీ అనుసంధానానికి చర్యలు తీసుకుంటుంది. నదుల అనుసంధానానికి 5 ముసాయిదా డీపీఆర్‌లు సిద్ధం చేసింది. అడవుల పెంపకానికి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపునకు స్టార్టప్‌లకు ఊతమిస్తోంది.''
-లక్ష్మణ్, భాజపా ఓబీసీ మెర్చా జాతీయాధ్యక్షుడు
ప్రజల్లో విశ్వాసం కల్పించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రజలపై ఒక్క రూపాయి అదనపు భారం పడకుండా కేంద్రబడ్జెట్ రూపొందించారని తెలిపారు.
ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్- సామాన్యులకు నమ్మకద్రోహం!'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!