కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా వాడాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ భాజపా క్యాంపు కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు పూస రాజు ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులను లక్ష్మణ్ పంపిణీ చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు. కరోనా సమయంలో పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే సేవాహీ సంఘటన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.
అందులో భాగంగానే భాజపా శ్రేణులు నిరుపేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా బాధిత కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం ప్రధాన మంత్రి పీఎం కేర్ నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. అలాగే ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని లక్ష్మణ్ సూచించారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి