ETV Bharat / state

LAXMAN: 'దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సామాజిక సమ్మేళనాలు'

బీసీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రాష్ట్రాల్లో ఉద్యమాలు చేపట్టనున్నామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రకటించారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సామాజిక సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

LAXMAN: 'దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సామాజిక సమ్మేళనాలు'
LAXMAN: 'దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సామాజిక సమ్మేళనాలు'
author img

By

Published : Aug 2, 2021, 9:16 PM IST

LAXMAN: 'దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సామాజిక సమ్మేళనాలు'

ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సామాజిక సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రకటించారు. ఈ సమ్మేళనాలు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉంటాయని తెలిపారు. ఆగస్టు 4న భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో దిల్లీలో సభ ఉంటుందని... ఇక్కడ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. కొత్తగా మంత్రులైన ఓబీసీలతో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీసీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రాష్ట్రాల్లో ఉద్యమాలు చేపట్టనున్నామని.. అందులో భాగంగా తెలంగాణలో కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.

కోర్టు ఉత్తర్వులున్నా... వైద్య విద్యలో ఓబీసీలకు యూపీఏ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించటంలో విఫలం అయిందని.. దీనికి యూపీఏలో ఉన్న అన్ని పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక విధానాలు అవలభించిందని.. భాజపా ప్రభుత్వం బీసీలకు సంబంధించి అనేక చర్యలు తీసుకుందన్నారు. బీసీ కమిషన్​కు రాజ్యాంగ హోదా కల్పించటంతో పాటు వర్గీకరణ కోసం రోహిణి కమిషన్, కేబినెట్​లో ఓబీసీ మంత్రుల సంఖ్య ఎన్నడూ లేనంతగా పెంచటం ఇందులో కొన్ని అని పేర్కొన్నారు.

ఓబీసీలకు మేలు చేసింది భాజపానే..

'ప్రాంతీయ పార్టీలన్ని కుటుంబ పార్టీలే తప్ప.. సమాజం కోసం, జాతి కోసం, కులం కోసం పనిచేసే పార్టీలు కాదు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏలో వీరందరు భాగస్వాములు. కానీ ఏనాడు కూడా ఓబీసీలకు మేలు చేసే మండలి కమిషన్​ రిజర్వేషన్లు అమలు చేయాలనే కించిత్తు ఆలోచన కూడా చేయలేదు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీల హయాంలో మండలి కమిషన్​, కాకా కాలేకర్​ కమిషన్ల అమలును పట్టించుకున్న పాపాన పోలేదు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన అనంతరం బీసీ కమిషన్​ను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సామాజిక సమ్మేళనాలు నిర్వహించనున్నాం. ఈ సమ్మేళనాలు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉంటాయి.'

-లక్ష్మణ్​, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు

ఇవీ చదవండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా.. ఎందుకంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.