JP Nadda Telangana Tour : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ చేరుకున్న నడ్డా.. తెలంగాణలోని తాజా పరిస్థితులపై రాష్ట్ర నేతలతో చర్చించారు. అనంతరం సంపర్క్ సే సంవర్ధన్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్.. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, నృత్యకారిణి ఆనంద శంకర్ జయంత్‌తో విడివిడిగా సమావేశం నిర్వహించారు. మొదట జేపీ నడ్డా.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీ లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.
JP Nadda meets Professor Nageshwar : జేపీ నడ్డాతో భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోదీ 9 సంవత్సరాల పాలన గురించి జేపీ నడ్డా వివరించారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలు జరపడం మంచి సంప్రదాయమని చెప్పారు. తాము పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని.. అనేక అంశాలపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు.
"నరేంద్ర మోదీ 9 సంవత్సరాల పాలన గురించి జేపీ నడ్డా వివరించారు. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచి సంప్రదాయం. తాము పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం. అనేక అంశాలపై మాట్లాడుకున్నాం." - ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ
JP Nadda meet Ananda Shankar Jayant : అనంతరం జేపీ నడ్డా ఫిల్మ్‌నగర్‌లోని పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర జయంత్‌ను కలిశారు. ఆయనతో పాటు కిషన్‌రెడ్డి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 సంవత్సరాల పాలన విజయాలను వివరించడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను ఆమెకు అందచేశారు. ఇటీవలే 'మన్ కీ బాత్'లో ఆనంద శంకర పేరును ప్రధాని మోదీ ప్రస్తావించారు.
తమలాంటి సామాన్యుల ఇంటికి జేపీ నడ్డా , కిషన్‌రెడ్డి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆనంద శంకర జయంత్ తెలిపారు. ఈ క్రమంలోనే వారు.. తమ బృందం చేసిన నృత్యాన్ని వీక్షించారని చెప్పారు. క్లాసికల్ డ్యాన్స్‌కు సంబంధించిన పలు పుస్తకాలను కూడా తాము జేపీ నడ్డాకి అందజేయడం జరిగిందని ఆనంద శంకర జయంత్ వివరించారు. ఈ భేటీ అనంతరం జేపీ నడ్డా మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.
"తమలాంటి సామాన్యుల ఇంటికి జేపీ నడ్డా రావడం ఎంతో ఆనందంగా ఉంది. నరేంద్ర మోదీ 9 సంవత్సరాల పాలన గురించి జేపీ నడ్డా వివరించారు. మా బృందం చేసిన నృత్యాన్ని నడ్డా, కిషన్‌రెడ్డి వీక్షించారు. సంప్రదాయ నృత్యానికి సంబంధించిన పుస్తకాలు జేపీ నడ్డాకు అందించాం." - ఆనంద శంకర జయంత్, నృత్యకారిణి
ఇవీ చదవండి : BJP high command focused on Telangana : తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. అగ్రనేతల పర్యటనలు కలిసొచ్చేనా..!