భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా తనను నియమించినందుకు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కృతజ్జతలు తెలిపారు. ప్రధాన మంత్రి మోదీతో పాటు సీనియర్ నాయకులు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడతానని వెల్లడించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఓబీసీల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మొదటి నుంచి ఓబీసీలు భాజపా ప్రభుత్వానికి అండగా ఉన్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కింది స్థాయి వరకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుంటాం: హరీశ్‌రావు