BJP National Leaders Campaign in Telangana 2023 : రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతల నుంచి అభ్యర్థుల వరకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా.. ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీతో అభివృద్ది సంక్షేమం పరుగులు పెడుతుందని.. అవినీతి పార్టీలను అంతమొందించాలని పిలుపునిచ్చారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు.
BJP Election Campaign Telangana 2023 : గజ్వేల్, కామారెడ్డి.. రెండు చోట్లా బీజేపీనే గెలుస్తుందని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాష్ జావడేకర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో.. ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్‌కు మద్దతుగా.. మాదాపూర్‌లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం(Etela Rajendar Election Campaign)నిర్వహించారు. అనంతరం.. రాజేంద్రనగర్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఈటల రాజేందర్ రోడ్‌షో నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈటలను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ.. ఆయన సతీమణి జమున ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఖైరతాబాద్ కమలం అభ్యర్థి రామచంద్రారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచారం చేశారు.
కుటుంబపాలనతో ఇంకా ఎన్నిరోజులు బాధ పడతారు - బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి : యోగి ఆదిత్యనాథ్
MP Arvind Campaign in Korutla : హనుమకొండ జిల్లా పరకాల బీజేపీ అభ్యర్థి పగడాల కాళీ ప్రసాదరావు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంటింటి ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. ఆలేరు అభ్యర్థి పడాల శ్రీనివాస్ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్‌వింద్.. కేంద్రప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం.. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో అర్‌వింద్ పాల్గొన్నారు.
CPI Election Campaign In Kothagudem : కొత్తగూడెంలో సీపీఐ చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలు అభిప్రాయపడుతున్నారని.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సీపీఎం అభ్యర్థి మల్లికార్జున్‌రావుకు మద్దతుగా చేపట్టిన బైక్ ర్యాలీ, రోడ్‌షోలో.. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బీవీరాఘవులు పాల్గొన్నారు.
CPM Election Campaign Telangana 2023 : హైదరాబాద్ ముషీరాబాద్ సీపీఎం అభ్యర్థి దశరథ్‌కు మద్దతుగా చేపట్టిన బైక్ ర్యాలీని.. మాజీ ఎంపీ, సీపీఎం సీనియర్ నాయకులు మధు జెండా ఊపి ప్రారంభించారు. అవకాశవాద రాజకీయాలను అనుసరించే పార్టీలను చిత్తుగా ఓడించడానికి వామపక్షాలు నడుం బిగించాయని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీపీఎం అభ్యర్ధి పగడాల యాదయ్య గెలుపు కోసం.. సాగర్ రహదారిపై చేపట్టిన రోడ్‌షోలో.. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృంద కారత్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రచారానికి వెళ్లిన సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అవినీతితో ఉద్యోగాలు సాధించుకునేందుకేనా తెలంగాణ తెచ్చుకుంది : పవన్ కల్యాణ్
పోస్టల్ బ్యాలెట్ అంశంలో గందరగోళం - ఓటు హక్కు దూరం చేస్తారని ఉద్యోగుల ఆందోళన