ETV Bharat / state

ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదు : లక్ష్మణ్‌ - బీజేపీ ఎన్నికల ప్రచారం

BJP MP Laxman Fires on KCR : కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ.. సీఎం కేసీఆర్​కు మాత్రం నిధులు వచ్చాయని.. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాలను.. బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశలపై.. కేసీఆర్‌ నీళ్లు చల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP Election Campaign
BJP MP Laxman fires on KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 2:49 PM IST

ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ లాంటి సీఎంను ఎక్కడా చూడలేదు : లక్ష్మణ్‌

BJP MP Laxman Fires on KCR : ప్రజలకు అందుబాటులోలేని కేసీఆర్(CM KCR) వంటి ముఖ్యమంత్రిని.. దేశంలో ఎక్కడా చూడలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమాజిగూడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో లక్ష్మణ్ .. సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. కొత్త సచివాలయం నిర్మంచినప్పటికీ కేసీఆర్.. ప్రగతి భవన్​కే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. కమీషన్లకు కక్కుర్తి పడి.. రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు.

నల్లధనం, అక్రమ సంపాదన.. తెలంగాణ రాజకీయాలను శాసిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) పేరు మీద నీళ్లు రాలేదు కానీ.. కేసీఆర్ డబ్బు పోగు చేసుకున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రం తెలంగాణకు తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష.. నీళ్లు, నిధులు నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటోంది. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మజ్లీస్ కబంధ హస్తాలకింద బీఆర్ఎస్, కాంగ్రెస్ చిక్కుకున్నాయి. ఈ మూడు పార్టీలు బీజేపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. ఈ రెండు పార్టీలను నడిపించేది మజ్లిస్ పార్టీ. ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ లాంటి.. సీఎంను ఎక్కడా చూడలేదు. నల్లధనం, అక్రమ సంపాదనే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది." - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ

BJP Election Campaign : తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశ పడిందని.. నిరుద్యోగుల ఆశపై కేసీఆర్‌ నీళ్లు చల్లారని లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఏటా డీఎస్సీ వేసేవారని.. కేసీఆర్ సర్కారు డీఎస్సీ వేయడం మానేసిందని.. రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ వైఫల్యంతో ప్రభుత్వ బడులు మూత పడుతున్నాయని.. పేదవాడు చదువుకు దూరం అవుతున్నాడని లక్ష్మణ్ ఆక్షేపించారు.

నేడు రాష్ట్రానికి అమిత్‌ షా- 23 తర్వాత అగ్రనేతల విస్తృత ప్రచారం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రమే నిర్వహించిందని.. లక్ష్మణ్ గుర్తు చేశారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని తెలిపారు. 3 వందే భారత్‌ రైళ్లును కేంద్రం ఇచ్చిందని, జాతీయ రహదారులు మంజూరు చేశారని.. దేశంలోనే ఎక్కువ హైవేలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న పార్టీ బీజేపేనని.. 52 శాతం ఉన్న బీసీలు ఓట్లు వేస్తే బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే చూపిస్తామన్నారు.

యువతకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలే : లక్ష్మణ్​

ఏడు ప్రధాన అంశాలతో బీజేపీ ఇంద్రధనస్సు మేనిఫెస్టో - వారి సంక్షేమంపైనే స్పెషల్ ఫోకస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.