ఉపాధ్యాయ సమస్యలపై అనేక సార్లు శాసన మండలిలో లెవనెత్తినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం లక్డికాపుల్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయ ఐకాస చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తున్నారని.. అందుకే ఉపాధ్యాయుల సమస్యల పట్ల అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, నియామకాలతో పాటు పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు