హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు కాంగ్రెస్ నేత రతన్ సింగ్ నాయక్‌కు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికల వచ్చినా భాజపా అధికారంలోకి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
గిరిజనులకు తెరాస తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్‌తో జోడించి... గిరిజనులకు కూడా ఒకే చట్టం తీసుకొచ్చారని... ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. రిజర్వేషన్లపై జనాభా ప్రాతిపదికన గిరిజనులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు... 927 మంది మృతి