ETV Bharat / state

అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా: ఎమ్మెల్యే రఘునందనరావు - గనపార్క్​ వద్ద భాజపా నేతల నివాళి

కొన్నేళ్లుగా శాసనసభలో ప్రజల గొంతు వినిపించేవారు లేరని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ విమర్శించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతానని పేర్కొన్నారు. గన్‌పార్క్ వద్ద అమరవీరులకు భాజపా ఎమ్మెల్యేల నివాళులు అర్పించారు.

అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా: ఎమ్మెల్యే రఘునందనరావు

author img

By

Published : Mar 15, 2021, 11:30 AM IST

శాసన సభలో అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టేముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రజల పక్షాన పాలకుల తప్పిదాలను ఎండగడతానని అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసినట్లు రఘునందన్ రావు తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడతానని ప్రతిన పూనారు. అసెంబ్లీ వేదికగా మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పీఆర్సీ, ఉద్యోగ సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్నీ నిలదీస్తానని తెలిపారు. స్వరాష్ట్రం సిద్ధించిన ఆశయాలు నెరవేరేలా తనవంతు ప్రయత్నం చేస్తానని రఘునందన్‌రావు హామీ ఇచ్చారు.

అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా: ఎమ్మెల్యే రఘునందనరావు

ఇదీ చూడండి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... సభ్యులనుద్దేశించి గవర్నర్​ ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.