కరోనా పరీక్షల తీరుపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న 48 గంటల్లో నివేదిక ఇస్తామన్న ప్రభుత్వం.. తన ఐదుగురు అంగరక్షకులు పరీక్షలు చేయించుకుని ఐదు రోజులైనా రిపోర్ట్ ఇవ్వలేదన్నారు.
రిపోర్ట్‌లు అలస్యంగా ఇవ్వడం వల్ల పనిచేసే చోటుతోపాటు కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు, గన్‌మెన్‌లు కరోనా పరీక్షలు చేయించుకుంటే 48 గంటల్లో నివేదిక వచ్చేలా కృషి చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం