BJP MLA Candidates List 2023 : బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ సుదీర్ఘ కసర్తతు చేస్తోంది. అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుందన్న ప్రచారంతో కాషాయదళం అప్రమత్తమైంది. ఎన్నికల్లో పోటీకి ఆశావహుల నుంచి 6 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. కొంతమంది మూడు, నాలుగు స్థానాలకు అర్జీ పెట్టుకున్నారు. రాష్ట్ర నాయకత్వం 40 మందితో జాతీయ నాయకత్వానికి జాబితా పంపించిందని సమాచారం. చిన్నపాటి మార్పులు, చేర్పుల అనంతరం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు.
BJP MLA Candidate Selections : ఈ నెల 15 లేదా 16న.. బీజేపీ మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన
BJP MLA Candidates First List 2023 : ఏకాభిప్రాయం కుదరని మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కమలదళం నిమగ్నమైంది. జన, ధన బలం ఉన్న నేతలను గుర్తించేందుకు స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 15 లేదా 16న తొలి జాబితా ప్రకటించనున్న బీజేపీ.. తదుపరి రెండు జాబితాలను కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాత వెల్లడించాలని యోచిస్తోంది. ఎన్నికల షెడ్యూలుకు ముందే అగ్రనేతలతో ఒక దఫా ప్రచారం పూర్తి చేయాలని భావించిన పార్టీ.. మూడు రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీని రెండుసార్లు రాష్ట్రానికి రప్పించింది.
ఈ నెల 6న పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరైన కమల దళపతి నడ్డా.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగే జన గర్జన సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ మూడుసార్లు ప్రచారానికి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే అగ్రనేతల ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది.
Kishan Reddy Fires on CM KCR : 'కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ గడబిడ అవుతున్నారు'
తొలి జాబితా ఇదే..!
అంబర్‌పేట - కిషన్‌రెడ్డి
ముషీరాబాద్ - బండారు విజయలక్ష్మి
సనత్‌నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
మల్కాజిగిరి - రాంచందర్ రావు
ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి
గోషామహల్ - విక్రమ్ గౌడ్
మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్
కల్వకుర్తి - తల్లోజు ఆచారి
గద్వాల - డీకే అరుణ
మహబూబ్‌నగర్ - జితేందర్ రెడ్డి
తాండూరు - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం - బూర నర్సయ్య గౌడ్
కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి
ఆలేరు - కాసం వెంకటేశ్వర్లు
హుజూరాబాద్ - ఈటల రాజేందర్
కరీంనగర్ - బండి సంజయ్
చొప్పదండి - బొడిగే శోభ
వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
భూపాలపల్లి - చందుపట్ల కీర్తి రెడ్డి
వేములవాడ - చెన్నమనేని వికాస్‌రావు
ఆదిలాబాద్ - పాయల్ శంకర్
బోధ్ - సోయం బాపూరావు
ఆర్మూర్ - ధర్మపురి అర్వింద్
మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వర్లు
పరకాల - గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
దుబ్బాక - రఘునందన్ రావు
వర్ధన్నపేట - కొండేటి శ్రీధర్
మహబూబాబాద్ - హుస్సేన్ నాయక్
సికింద్రాబాద్ - బండా కార్తీక రెడ్డి
నర్సంపేట - రేవూరి ప్రకాశ్ రెడ్డి
నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి
వరంగల్ పశ్చిమ - ఏనుగుల రాకేష్ రెడ్డి
స్టేషన్ ఘన్పూర్ - విజయరామారావు
రాజేంద్రనగర్ - తోకల శ్రీనివాస్ రెడ్డి
BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు