ETV Bharat / state

BJP MLA Candidate Applications Telangana 2023 : బీజేపీ ఆశావాహుల అప్లికేషన్స్​ స్టార్ట్​.. మొదటి వేసింది ఎవరో తెలుసా..! - బీజేపీ ఎమ్మెల్యే అప్లికేషన్

BJP MLA Candidate Applications Telangana 2023 : బీజేపీ ఆశావాహుల నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొదటి అర్జీ సికింద్రాబాద్​ నుంచి పోటీ చేసేందుకు రవిప్రసాద్​ గౌడ్​ అందించారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్​ 10 వరకు కొనసాగనుంది.

Telangana Assembly Elections 2023
BJP MLAs Applications in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 2:16 PM IST

BJP MLA Candidate Applications Telangana 2023 : ఈ సంవత్సరం దేశంలో ఐదు రాష్ట్రల్లో ఎన్నికలు జరగనుండగా.. అందులో ఒకటి తెలంగాణ. రాష్ట్రంలో డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023) జరగనున్నట్లు సమాచారం. శాసన సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్ని సన్నద్ధం అవుతున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీకి ఈసారి ఎలాగైన గెలిచే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు తమ వంతు కృషి చేస్తూ.. పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుసున్నాయి. అందులో భాగంగా ఎన్నికల్లో ప్రముఖ ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తున్నాయి.

Applications for BJP MLA Aspirants Telangana 2023 : ఇటీవలే కాంగ్రెస్​ పార్టీ(Telangana Congress MLAs List) తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వెయ్యికి పైగా దరఖాస్తులు రావడంతో పార్టీ ప్రాధాన నాయకులు ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ అంశంపై స్క్రీనింగ్​ కమిటీని వేసింది. కాంగ్రెస్​ పార్టీ తమ అభ్యర్థులను ఈ నెల 15 తరవాత తొలి జాబితాను ప్రకటించనుంది. ఇదే పంథాను బీజేపీ కూడా అనుసరిస్తోంది.

శాసనసభ ఎన్నికలకు పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో మాగం రంగారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు రవిప్రసాద్‌గౌడ్ తొలి దరఖాస్తు(BJP MLA Candidate Application) అందించారు. జనగామ నుంచి జగదీష్ ప్రసాద్ శివశంకర్ దరఖాస్తు చేసుకున్నారు.

BJP MLA Candidates Selection Telangana 2023 : ఎమ్మెల్యే టికెట్‌కు ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరణ

Telangana BJP MLAs Lists 2023 : ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. దరఖాస్తుల పరిశీలన కోసం స్రీనింగ్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో జాతీయ నాయకత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తైన అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ నెల 17 తరువాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ కోసం ఆశావహులు భారీగా దరఖాస్తులు చేసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

న్నికల్లో గెలిచేందుకు సత్ప్రవర్తన, మంచి వక్త.. ఇతర లక్షణాలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బీజేపీ వేసింది. అధికార పార్టీ అయిన బీఆర్​ఎస్​ ఇప్పటికే దాదాపు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆయా అభ్యర్థులకు దీటుగా అభ్యర్థులను నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

BJP Bus Yatra in Telangana : సెప్టెంబర్ 17 నుంచి బీజేపీ బస్సు యాత్ర.. 3 మార్గాలు ఖరారు

Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.