పేద ప్రజల నడ్డివిరిచే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని మంగళవారం ఉదయం గోల్కొండ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భాజపా లంగర్‌హౌస్ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్న ఈ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎల్ఆర్ఎస్ భయంతో ప్లాట్ల లావాదేవీలు చేయట్లేదని.. కొన్నవారు కూడా ఎల్ఆర్ఎస్ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో భాజపా లంగర్హౌన్ డివిజన్ అధ్యక్షుడు నాగేంద్ర, ప్రకాష్‌రెడ్డితో పాటు శ్రవంత్, రాజేష్ తదితర భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!