సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టు చేశారు. అంసెబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన్నప్పటికీ... అసెంబ్లీ పరిసర ప్రాంతాల వరకు భాజపా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
నాంపల్లి, బషీర్బాగ్, పోలీసు కంట్రోల్ రూం ముందు పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. వారు ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భాజపా నేతల అరెస్ట్