ETV Bharat / state

డంపింగ్​ యార్డ్​ నిర్మాణం ఆపాలంటూ భాజపా ఆందోళన

పార్కు స్థలంలో డంపింగ్ యార్డ్​ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని మేడ్చల్​ జిల్లా కిసాన్​ మోర్చా ఉపాధ్యక్షుడు తిరుపతి యాదవ్​ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్​ ఓల్డ్​ బోయిన్​పల్లిలోని హస్మత్​ పేట్​ చెరువు వద్ద స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు.

bjp leaders andolana on dumping yard  in hasmath pet cheruvu in secunderabad today
డంపింగ్​ యార్డ్​ నిర్మాణం ఆపాలంటూ భాజపా ఆందోళన
author img

By

Published : Feb 25, 2021, 7:01 PM IST

చెరువుల సుందరీకరణ పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కిసాన్ మోర్చా మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి యాదవ్​ విమర్శించారు. సికింద్రాబాద్​లోని ఓల్డ్ బోయిన్​పల్లి హస్మత్​ పేట్​ చెరువు పక్కన పార్కును డంపింగ్ యార్డుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కు స్థలాన్ని కాపాడాలంటూ స్థానికులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు.

అంజయ్యనగర్, హస్మత్ పేట్​లో నివసిస్తున్న వారంతా పేద ప్రజలేనని ఆయన తెలిపారు. ఇప్పటికే చెరువు నిండా గుర్రపు డెక్క పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని పార్కును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గుర్రపు డెక్కను తొలగించేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ నిర్మాణం ఆపాలని కోరారు. లేని పక్షంలో భాజపా ఆధ్వర్యంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని తిరుపతి యాదవ్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి : 'నూతన చట్టాలు అమలు చేసి పరిశుభ్రంగా ఉంచండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.