SAMA RANGA REDDY: సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను విడనాడాలని భాజపా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పేర్కొన్నారు. సీఎం మరో ఔరంగజేబులా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని మాల్ మైసమ్మ దేవాలయంను కూల్చివేయాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అందుకు నిరసనగా ఆలయం ఎదుట ఆయన ధర్నా నిర్వహించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గుడులను కూల్చడానికే తెరాసలో చేరారని సామ రంగారెడ్డి విమర్శించారు. తెరాస ప్రభుత్వంలో హిందువులపై దాడులు, హత్యలు పెరిగాయన్నారు. ఇకనైనా రోడ్ల విస్తరణ పేర్లతో ఆలయాల కూల్చివేతను విరమించుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హిందువుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వానికి చరమగీతం పాడాలని సామ రంగారెడ్డి పేర్కొన్నారు.
"హిందు దేవాలయాల మీద ఇంత కక్షపూరిత చర్య ఎందుకు. అభివృద్ధికి ఎవ్వరూ అడ్డం కాదు. కానీ చరిత్ర కలిగిన ఆలయాన్ని కూల్చడం తప్పు. ఈ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం." -సామ రంగారెడ్డి, భాజపా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు
ఇదీ చదవండి: రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి