కాంగ్రెస్ నేతలు చలో రాజ్‌భవన్ చేపట్టడం.. దేశవ్యాప్తంగా నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ, భాజపా కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అందరికీ తెలుసన్న పొంగులేటి.. రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని మండిపడ్డారు.
రాజస్థాన్ రాజకీయాల్లో ఏదో జరుగుతోందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను పొంగులేటి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం, సమర్థవంత నాయకత్వ లేమే రాజస్థాన్ సంక్షోభానికి కారణమన్నారు. మహారాష్ట్రలో శివసేన, భాజపా కూటమికి ఓటర్లు పట్టం కడితే.. కాంగ్రెస్ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీని గౌరవించుకోలేని కాంగ్రెస్ పార్టీ.. భాజపాపై బురద జల్లుతోందంటూ ధ్వజమెత్తారు.
ఇదీచూడండి: తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి