ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసమే ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ ఏకైక రాష్ట్రం తెలంగాణ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రతి ఏడులాగే ఈ ఏడు అంగరంగ వైభవంగా బతుకమ్మను జరుపుకునేలా ప్రస్తుత పరిస్థితులు లేవని, మహిళలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ జరుపుకోవాలని లక్ష్మణ్ సూచించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఈనెల 19న దిల్లీలో ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.