ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమైనట్లు వస్తున్న వార్తలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రులు రూ.1500 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.800 కోట్లేనని చెప్పడం వల్ల రెండింటి మధ్య పొంతన లేదన్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రూ.600 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని చెబుతుండడం గందరగోళంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది అనడానికి ఆరోగ్యశ్రీ సేవలు నిలుపేయడమే ఓ ఉదాహరణని... ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు బకాయిలు ఉన్న మాట వాస్తవమని తెలిపారు.
ఇదీ చూడండి: సుమారు 25 వేల మంది భాజపాలో చేరుతారు: ఎంపీ గరికపాటి