టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 370 ఆర్టికల్, జమ్మూ కశ్మీర్ విభజనపై చర్చకు ఉత్తమ్ సిద్ధంగా ఉండాలని ఆయన సవాల్ విసిరారు. జాతీయ సమస్యను అంతర్జాతీయ సమస్యగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కొద్ది రోజుల్లోనే గాంధీభవన్‌కు ఫర్ సేల్ బోర్డు పెడతారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విమోచన దినం అమిత్ షా నేతృత్వంలో జరిగి తీరుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ నెల 18న పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారని వెల్లడించారు. నడ్డా సమక్షంలో తెదేపాకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. భాజపా ఎక్కడుందని విమర్శిస్తున్న కేటీఆర్... నిజామాబాద్‌కు వెళితే కనిపిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: కమలతీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎంపీ వివేక్