భైంసాలో ఎన్నికల ప్రచారం చేసే పరిస్థితి లేదని... అక్కడ ఎన్నికలు వాయిదావేయాలని భాజపా నేతలు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసి విజ్ఞప్తిచేశారు. మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, భాజపా నేతలు కలిసి భైంసాలో జరుగుతున్న పరిస్థితిని వివరించారు.
తెరాస, కాంగ్రెస్, ఎం.ఐ.ఎం ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. భాజపా నేతను విత్ డ్రా చేసుకోవాలని తెరాస నేతలు భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని... తెరాస ఎం.ఐ.ఎంను పాముకు పాలు పోసి పెంచినట్లు పెంచుతోందని ఇంద్రసేనా రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇవీ చూడండి: వాళ్లకు అభ్యర్థులు లేరు.. అంశాలు లేవు: పల్లా