రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేరని... అంశాలు లేవని తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటున్నట్లు భాజపా గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.
ఏటా పన్నుల రూపంలో రూ.65 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి కేవలం రూ.23 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వస్తోందని వివరించారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: పురపోరుకు సిద్ధమైన నేతన్నల ఖిల్లా... సిరిసిల్ల...