ETV Bharat / state

దేవుళ్లకు ప్రాంతీయత అంటగడతారా..?: విజయశాంతి

author img

By

Published : Jan 21, 2021, 10:46 PM IST

దేవుళ్లకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం తెరాస నేతలకే చెల్లిందని సినీనటి, భాజపా నేత విజయశాంతి అన్నారు. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు... తెలంగాణ రాముడంటూ విడదీస్తారా అంటూ మండిపడ్డారు.

bjp leader fire on trs mla kalvakuntla vidyasagar rao indirectly
దేవుళ్లకు ప్రాంతీయత అంటగడతున్నారు: విజయశాంతి

అయోధ్య రామాలయానికి విరాళాలివ్వొద్దని తమ ద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని తెరాసపై సినీనటి, భాజపా నేత విజయశాంతి విమర్శించారు. దేవుళ్లకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం తెరాస నేతలకే చెల్లిందన్నారు. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు... తెలంగాణ రాముడంటూ విడదీస్తున్నారని మండిపడ్డారు.

విరాళాన్ని భిక్షం అంటూ.. ఆరాధ్య భావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారని దుయ్యబట్టారు. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా... అంటున్న ఆ తెరాస నేత.. ఇళ్లలోనే పూజామందిరాలు ఉన్నప్పుడు గుళ్లకు... పుణ్యక్షేత్రాలకు వెళ్లడం దేనికో.... చెప్పాలని ప్రశ్నించారు. ఇలా తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే తెరాస నేతలను ప్రజలు ఇళ్లకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.