కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ కరోనా సోకి మృతి చెందిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబానికి కార్వాన్ భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి అమర్ సింగ్ అండగా నిలిచారు. బుధవారం దయాకర్ రెడ్డి కుటుంబానికి విరాళంగా 1,01,000/- రూపాయల చెక్కును స్థానిక పోలీస్ అధికారులకు అందజేశారు. ఈ చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు పంపించాలని అమర్ సింగ్ పోలీస్ అధికారులను కోరారు.
తెలంగాణ ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహించి ప్రాణాలను అర్పించిన దయాకర్ రెడ్డి లాంటి పోలీస్ అధికారిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అమర్ సింగ్ తెలిపారు. దయాకర్ రెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.