Boora Narsaiah Goud fires on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భాజపా నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం సొంత కుమార్తె పేరును వాడుకోవడం కేసీఆర్‌కు చెల్లిందని మండిపడ్డారు. కవిత కాదు కదా... తెరాస పార్టీని భాజపాలో విలీనం చేస్తామన్న ఒప్పుకోమని స్పష్టం చేశారు. కవిత ఓటమి వెనుక తెరాస అధిష్ఠానం ఉందని ఆరోపణలు వచ్చాయని బూర నర్సయ్య పేర్కొన్నారు.
భాజపా ఆరోపణలే నిజమయ్యాయి.. : వచ్చే ఎన్నికల్లో తొంభై శాతం తెరాస ఎమ్మెల్యేలు గెలవరని బూర నర్సయ్యగౌడ్ జోస్యం చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు నిర్భందించారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ విషయంలో భాజపా ఆరోపణలే నిజమయ్యాయని తెలిపారు. ఫాంహౌస్ ఘటనను సీబీఐ లేదా హైకోర్టు మాత్రమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో బీసీలు అణిచివేతను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారి ఆర్థిక అణచివేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. బీసీ ఫెడరేషన్‌కు ఎనిమిదేళ్లలో రూ.230 కోట్లే కేటాయించటం దారుణమని బూర మండిపడ్డారు. భాజపా అధికారంలోకి వస్తే బీసీలు సహా ఎవరైనా సీఎం కావచ్చునని బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు.
ఇవీ చదవండి: