ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, దేశంలో అతి తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని భాజపా నేత లక్ష్మణ్ విమర్శించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు మూడు రోజులపాటు ధర్నా చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కరోనా సమస్యలపై సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసేందుకు నిర్ణయించిన లక్ష్మణ్, ఇతర భాజపా నేతలను ఇంటి నుంచి బయటికి రానీయకుండా గృహనిర్బంధంలో ఉంచారు.
కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాల తారుమారు, జర్నలిస్ట్ మృతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో రోజులు వేల సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తుంటే... రాష్ట్రంలో మాత్రం వందల్లోనే ఉందని లక్ష్మణ్ తెలిపారు.
ఇదీ చదవండి: 'ఆ జిల్లా మంత్రిగా ఎంతో గర్వపడుతున్నా'