ETV Bharat / state

"కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ - తెలంగాణకు బీఆర్​ఎస్​ అవసరం లేదు" - parliament elections

BJP Kishan Reddy on Parliament Elections : భవిష్యత్‌ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్​ఎస్​ కనుమరుగు కానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని బీజేపీ గెలుస్తుందన్న కిషన్‌రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్​ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు.

BJP Plan on Loksabha Elections
BJP Kishan Reddy on Parliament Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 7:44 PM IST

BJP Kishan Reddy on Parliament Elections : పార్లమెంట్ ఎన్నికలకు(Parliament elections) బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాయత్తమవుతోంది. పది ఎంపీ సీట్లు, 35శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్న కమలదళం, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(Kishan reddy) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జిలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరయ్యారు.

పార్టీ కీలక నాయకులు బండి‌ సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించారు. మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. బీజేపీ శాసనసభా పక్షనేత ఎన్నికపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

మోదీతో పోటీకి దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వేలన్నీ చెబుతున్నాయి : కిషన్‌రెడ్డి

ఇప్పటికే క్షేత్రస్థాయిలో శ్రేణులను సిద్ధం చేయటంతో పాటు అభ్యర్థుల కసరత్తు దాదాపుగా పూర్తిచేసిన నేపథ్యంలో తాజాగా 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి, సీనియర్‌ నాయకులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జ్‌గా రాజాసింగ్, సికింద్రాబాద్ ఇన్‌ఛార్జ్‌గా ఎంపీ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు.

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, చేవెళ్లకు ఏవీఎన్​రెడ్డిని నియమించారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి చింతల రామచంద్రారెడ్డికి, భువనగిరికి ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. జహీరాబాద్‌కు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మెదక్‌కు పాల్వాయి హరీశ్‌బాబును నియమించారు.

మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి గరికపాటి మోహనరావు, ఖమ్మంకు పొంగులేటి సుధాకర్ రెడ్డి, వరంగల్ స్థానానికి మర్రి శశిధరరెడ్డిని నియమించగా కరీంనగర్ బాధ్యతలు ధనపాల్ సూర్యనారాయణ గుప్తాకు అప్పగించారు. సంక్రాంతి తర్వాత జాతీయ స్థాయిలో ప్రచారాన్ని వేగవంతం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలు, వర్గాల వారీగా సమావేశమై ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన అంశాలను సేకరిస్తామని, నూతనంగా ఓటు హక్కు పొందిన యువతను స్వయంగా వెళ్లి కలుస్తామన్నారు.

BJP Plan on Loksabha Elections : సంక్రాంతి నుంచి 22వ తేదీ వరకు దేవాలయాలను పరిశుభ్ర పరిచేందుకు స్వచ్ఛ అభియాన్ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో తెలంగాణ భాగస్వామ్యం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా ప్రతి దేవాలయంలో భారీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ నెల 22న దేశమంతా రామజ్యోతులతో కళకళలాడాలని రామజన్మ భూమి ట్రస్ట్ పిలుపునిచ్చిందని, రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ సహకరించాలని కిషన్​రెడ్డి కోరారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ధాటిని తట్టుకోలేక రాహుల్ గాంధీ కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇంచార్జీలను నియమించనున్నట్లు, ఆర్గనైజేషన్​ ఇంచార్జీలను రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమన్వయం కోసం పార్లమెంట్ కన్వీనర్లను నియమించనున్నట్లు తెలిపారు.

"రాష్ట్రంలో రాబోయే లోక్​సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల మధ్యే ఉంటుంది. తెలంగాణకు బీఆర్​ఎస్ పార్టీ​, కేసీఆర్​ ఆవశ్యకత అవసరం లేదు. పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు". - కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

"కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ- బీఆర్​ఎస్​ ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు"

పార్లమెంట్​ ఎన్నికల నోటిఫికేషన్​ ఫిబ్రవరి 28న రావచ్చు : కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.