ప్రజాసంక్షేమం కోసమే ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి అన్నారు. నగరంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. శనివారం కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ పలువురితో కలిసి తార్నాక చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీగా తరలివెళ్లి కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గడిచిన రోజులు, తాను పనిచేసిన పార్టీలు అభివృద్ధిలో కుంటుపడి, ప్రజాక్షేమం మరిచాయని అందుకే భాజపాలో చేరుతున్నట్లు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీయర్ నాయకులు మేకల సారంగపాణి, రవిప్రసాద్ గౌడ్, వెంకటేష్ గౌడ్లు హాజరయ్యారు.
ఇదీ చూడండి : దేశం గొప్ప నేతను కోల్పోయింది: భాజపా