జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం గెలుపు ఖాయమని జియాగూడ డివిజన్ అభ్యర్థి దర్శన్ తెలిపారు. గ్రేటర్లో ప్రచారం చివరి రోజు కావడంతో డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. భాజపా కార్యకర్తలతో భారీగా ద్విచక్రవాహనలతో ర్యాలీ నిర్వహించారు.
జియాగూడలో తెరాస కార్పొరేటర్ చేసినా అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. ప్రజలంతా భాజపా వైపే ఉన్నారని భారీ మెజారిటీతో తన డివిజన్లో కాషాయం జెండా ఎగరేస్తామని దర్శన్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థి ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.