కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా హైదరాబాద్ వస్తున్న కిషన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ... ఫ్లెక్సీల ఏర్పాటుపై వివాదం మొదలైంది. స్థానిక నేత బండపల్లి సతీష్... ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తన ఫొటో లేదని భాజపా అసెంబ్లీ ఇంఛార్జీ రవిప్రసాద్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొబ్బరి బోండాల కత్తితో రోడ్డుపై ఉన్న ఫ్లెక్సీలను చింపేశాడు. విషయం తెలుసుకున్న సతీష్... రవిప్రసాద్ గౌడ్‌పై చిలకలగూడాపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు!