ETV Bharat / state

మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన భాజపా - munugode bypoll

BJP filed a rit petition in the ts High Court against the registration of munugode votes
మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన భాజపా
author img

By

Published : Oct 11, 2022, 12:11 PM IST

Updated : Oct 11, 2022, 12:33 PM IST

12:09 October 11

మునుగోడులో ఓట్ల నమోదుపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన భాజపా

మునుగోడులో బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని భాజపా ఆరోపించింది. ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఉపఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. తక్కువ సమయంలోనే మునుగోడులో 25 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఫాం-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపించింది. ఈ నెల 14న మునుగోడు ఓటరు జాబితాను ఈసీ ప్రకటించనుంది. లిస్ట్‌ ప్రకటించకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు విన్నవించింది. ఈ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఎల్లుండి విచారణ జరపనుంది.

Last Updated : Oct 11, 2022, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.