BJP Election Campaign Telangana 2023 : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేస్తామని.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మోదీ(PM MODI) మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తుప్రాన్, నిర్మల్, కామారెడ్డి, మహేశ్వరం, కరీంనగర్, మహబూబ్ బాద్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభలకు రానున్నారని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్ షో(Modi Road Show)కు హాజరవుతారని పేర్కొన్నారు.
Kishan Reddy Latest Comments on KCR : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ధ్వజమెత్తారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్(Congress)కు ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ తన కుమారుడు సీఎం అవుతాడని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటూ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని.. ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్(KCR) కుటుంబానికి అబద్దాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యగా పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఎందుకు ఆలస్యమవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. 2014 హామీకి కట్టుబడి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తుందా అని ప్రశ్నించారు. ఒక మహిళా కేంద్రమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఘాటుగా విమర్శించారు.
'బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు - కాంగ్రెస్ ఫేక్ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు'
Kishan Reddy Comments BRS : రాష్ట్రంలో బీజేపీకి రోజు రోజుకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారన్నారు. బీసీ సంఘాలు కలిసి తమ పార్టీకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. బీసీ వర్గాల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ సర్కారు పని చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. కర్ణాటక తరువాత తెలంగాణలో గెలుస్తామని కలలు కంటోందని ఎద్దేవా చేశారు.
"కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కాంగ్రెస్ కుంభకోణాలకు పాల్పడింది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలి. రీజినల్ రింగ్ రోడ్డు ఎందుకు ఆలస్యం అవుతుంది కేసీఆర్ చెప్పాలి. మహిళా కేంద్ర మంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు."- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్నికల్లో ఓట్లు పొందాలనే ఉద్దేశం తప్ప - కాంగ్రెస్ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదు - కిషన్ రెడ్డి
డబ్బులతో గెలవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చూస్తున్నాయి : కిషన్‌రెడ్డి
ఎస్సీ వర్గీకరణ ఆలస్యంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ : కిషన్‌రెడ్డి