హైదరాబాద్ జియాగూడలోని 100ఫీట్ల రోడ్ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలంగించాలని స్థానిక భాజపా కార్పొరేటర్ దర్శన్ డిమాండ్ చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును శాశ్వతంగా ఉంచేలా అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో స్థానికులకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కాసేపట్లో ప్రారంభంకానున్న డ్రై రన్