ETV Bharat / state

' కలుషిత నీటితో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి' - ఖైరతాబాద్ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్ల ధర్నా తాజా వార్తలు

BJP CORPORATORS PROTEST: ఖైరతాబాద్ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్ల ధర్నా నిర్వహించారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కలుషిత నీటిని నివారించాలంటూ భాజపా కార్పొరేటర్ల నినాదాలు చేశారు.

BJP dharna at Khairatabad
ఖైరతాబాద్ జలమండలి వద్ద భాజపా ధర్నా
author img

By

Published : Apr 26, 2022, 12:38 PM IST

Updated : Apr 26, 2022, 1:38 PM IST

BJP CORPORATORS PROTEST: హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జలమండలి కార్యాలయాన్ని భాజపా ముట్టడించింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. కలుషిత నీటిని నివారించాలంటూ నినాదాలు చేశారు. జలమండలి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన భాజపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో స్వల్ప వాగ్వాదం నెలకొంది.

హైదరాబాద్‌లో కలుషిత నీటితో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు . ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదన్నారు. నిజాం కాలంలో వేసిన పైపులైన్లే ఇప్పటికీ ఉన్నాయి. రాష్ట్రానికి ఖర్చు చేస్తున్న నిధుల్లో 90 శాతం హైదరాబాద్​కు చెందినవి. వానాకాలం సమీపిస్తున్నా నాలాల్లో పూడిక తీయడం లేదని పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లోని సమస్యలను వాటర్ బోర్డు గాలికొదిలేసిందని విమర్శించారు. కలుషిత నీటితో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి ఆయన డిమాండ్ చేశారు. తాగునీటికి, డ్రైనేజీకి కొత్త పైపులైన్లు వేయాలి. 10 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని చింతల రామచంద్రారెడ్డి హెచ్చరించారు.

"గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వచ్చినట్టువంటి వర్షానికి మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఏమైనా పనులు చేపట్టిందా. సుమారు 24నాలలతో హైదరాబాద్​లో వర్షం నీరు నిలుస్తోంది. అక్కడ డ్రైనేజి సిస్టమ్​ అంతా నాలాలో కలిపారు. వానాకాలం సమీపిస్తున్నా నాలాల్లో పూడిక తీయడం లేదు. తీసినా పూడికను సిమెంట్ బస్తాలలో తీసుకువెళ్లాలి. పాత పైపులైన్​లు ఎందుకు వాడుతున్నారు. శేరిలింగంపల్లి , ముషీరాబాద్​లో చాలా చోట్ల కలుషిత నీరు వస్తోంది. కోట్ల ఆదాయం ఉన్న హైదరాబాద్ ఎందుకు పట్టించుకోవడం లేదు. డబ్బులను తీసుకెళ్లి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్​కు 1800 ఎమ్​ఎమ్​ డయాఫ్రేమ్​ పైపులైన్​ వేయాలి. 75 సంవత్సరాలు క్రితం వేసిన పైపులైన్​ని నేటికి మంచినీరు కోసం వాడుతున్నారు. ప్రభుత్వం ఇవన్ని పట్టించుకోకుండా మాటల గారడీ చేస్తుంది."

- చింతల రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే

ఖైరతాబాద్ జలమండలి వద్ద భాజపా కార్పొరేటర్ల ధర్నా

ఇదీ చదవండి: 'వేయిస్తంభాల గుడి కల్యాణమండపం పునరుద్ధరణకు రూ.15 కోట్లు'

కాంగ్రెస్ ప్రక్షాళనకు మేధోమథనం.. ఉదయ్​పుర్​లో చింతన్ శివిర్​

Last Updated : Apr 26, 2022, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.