ETV Bharat / state

'ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డిని అరెస్టు చేయాలి' - land grabbing allegations on mla subhash reddy

హైదరాబాద్ కాప్రా భూఅక్రమాలపై కేసు నమోదైన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డి, ఇంఛార్జ్ తహశీల్దార్ గౌతమ్​ను వెంటనే అరెస్టు చేయాలని భాజపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

bjp corporators, bjp corporators dharna, bjp corporators protest
భాజపా కార్పొరేటర్లు, భాజపా కార్పొరేటర్ల ఆందోళన, భాజపా కార్పొరేటర్ల ధర్నా
author img

By

Published : May 27, 2021, 1:46 PM IST

హైదరాబాద్‌ కాప్రా భూ అక్రమాలపై కేసు నమోదైన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా ఇంఛార్జ్ తహశీల్దార్ గౌతమ్​ను వెంటనే అరెస్టు చేయాలని రామంతాపూర్, హబ్సిగూడ కార్పొరేటర్లు డిమాండ్​ చేశారు. సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. ఈ రెండు డివిజన్ల అధ్యక్షులు బండారు వెంకట్రావు, హరీష్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ఉప్పల్, చిలుకానగర్ డివిజన్​లలోనూ భాజపా నేతలు ఆందోళన నిర్వహించారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుభాశ్ రెడ్డి, గౌతమ్ కుమార్​లను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని తెరాస పార్టీకి చెందిన కింది స్థాయి నాయకుల నుంచి పైస్థాయి వరకు భూఅక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెరాస పాలన అవినీతి మయంగా మారిందని విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.