ETV Bharat / state

BJP Demand TS Government on Heavy Rains : "ప్రజలు వరదల్లో కొట్టుకుపోతుంటే.. కేసీఆర్​ రాజకీయాల్లో మునిగిపోయారు" - బీజేపీ కామెంట్స్​ ఆన్ గవర్నమెంట్​

BJP Comments on Heavy Rains in TS : గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్న తీరుపై బీజేపీ నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలను పట్టించుకోకుండా.. రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వర్షాల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 29, 2023, 4:36 PM IST

BJP Criticises TS Government Action on Heavy Rains : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ విమర్శించింది. రాష్ట్రంలో వరద ప్రభావం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 33 మంది మృతి చెందారని పేర్కొంది. వారికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేసింది.

BJP instructions to TS Government on Rain : రాష్ట్రంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టించుకోకుండా.. రాజకీయాల్లో మునిగిపోయారని ఆరోపించారు. కనీసం కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేయలేదని ఆరోపించింది. వరద ఉధృతంగా ప్రవహించడంలో వల్ల కొన్ని ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని.. ముఖ్యంగా కడెం ప్రాజెక్ట్​ భారీ స్థాయిలో సమస్యకు గురైందని.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ డిమాండ్​ చేసింది. వరదల వల్ల పట్టణ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లిందని తెలిపింది. వరద ప్రహహం వల్ల కొంత మంది రోడ్డు పడ్డారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొంది. కొన్ని పట్టణాల్లో ఇప్పటికే డ్రైనేజ్​ వాటర్​ చేరినందున అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే.. సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది.

Bandi Sanjay Comments on CM KCR : రాష్ట్రంలో ప్రభుత్వం వరదలపై ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే ఎలాంటి చర్యలు చేయలేదని బీజేపీ నాయకుడు బండి సంజయ్​ మండిపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వర్ష ప్రభావంపైన ముందుగానే మేల్కొంటే ఇంత ప్రమాదం.. ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదని విచారం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు కాపాడేందుకు అధికారులు కష్టపడుతున్న ప్రభుత్వం సహకరించలేదని ధ్వజమెత్తారు.

Hyderabad Roads Damage 2023 : వర్షాలకు చిత్తడైన హైదరాబాద్​ రోడ్లు.. నగరంలో 4 వేల గుంతలు.. ముంపులోనే కాలనీలు

Sanjay and Kishan Reddy Visit Flood prone Areas : ఎన్టీఆర్​ఎఫ్​ బలగాలు రంగంలోకి దిగేంత వరకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎందుకు సహాయక చర్యలు తీసుకోలేదని నిలదీశారు. యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదివారం వరంగల్​లో పర్యటిస్తారని తెలిపారు. అనంతరం ఈ నెల 31న మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తారని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.