రాష్ట్రంలో భాజపా గాలి బలంగా వీస్తోందని ఆర్కేపురం డివిజన్ భాజపా అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కాషాయ జెండా ఎగరేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 2016లో డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో భాజపా గెలుపొందిందని... మళ్లీ తనకు ప్రజలు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలనీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటూ గతంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చినట్లు గుర్తు చేశారు.
మహిళల కోరుకున్నట్లుగానే మద్యం దుకాణాన్ని ఎత్తివేయించినట్లు వెల్లడించారు. డివిజన్‌లో రూ.45కోట్లతో అభివృద్ది పనులు చేపట్టానని పేర్కొన్నారు. మహిళలకు రుణాలు ఇప్పించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: గచ్చిబౌలిలో భారీ మెజారిటీ ఖాయం: భాజపా అభ్యర్థి