సీఎం కేసీఆర్ దత్తత డివిజన్ బౌద్ధనగర్‌లో అభివృద్ధి శూన్యమని భాజపా అభ్యర్థి మేకల కావ్య విమర్శించారు. ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆమె అన్నారు. పార్సిగుట్ట ప్రాంతాన్ని ప్యారిస్లా మారుస్తామని హామీలు ఇచ్చి మరిచిపోయారని తెలిపారు.
వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కావ్య పేర్కొన్నారు. ఇంతవరకు నాలాల విస్తరణ చేపట్టలేదన్నారు. భాజపాకు అవకాశం ఇస్తే డివిజన్లో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.